: రక్తం కారేలా ఘాటు ముద్దు
సినిమాల్లో ముద్దు సన్నివేశాలకు అశేష ప్రజాదరణ ఉంటుంది. అందుకే హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ, మళయాల సినిమాల్లో ముద్దు సన్నివేశానికి ఓ ప్రత్యేక స్థానముంది. గాఢచుంబనాలు యువతరాన్ని సినిమా హాళ్ల వైపు నడిపిస్తాయనేది నిర్వివాదాంశం. ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించేందుకు సినీ హీరో, హీరోయిన్లు గాఢచుంబనాలతో రక్తికట్టిస్తుంటారు. అలాంటి ముద్దు హాలీవుడ్ నటి ఎమ్మావాట్సన్ (హ్యారీపోటర్ ఫేం) కు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
నోవా అనే సినిమా షూటింగ్ లో డగ్లస్ బూత్ తో ఎమ్మా థాంప్సన్ గాఢచుంబనం సన్నివేశం పదేపదే చిత్రీకరించడంతో ముద్దు మోతాదు మించి ఎమ్మా పెదాలు గాయపడి రక్తం కారాయట. రక్తం కారితే కారింది కానీ ముద్దు సన్నివేశం మాత్రం బాగా వచ్చిందని దర్శకుడు హర్షం వ్యక్తం చేశారు.