: సినీ హీరో రామ్ చరణ్ పై కేసు నమోదు
తెలుగు సినిమా హీరో రామ్ చరణ్ పై హైదరాబాదు, జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అనుమతి లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు జీహెచ్ఎంసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాంచరణ్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.