: స్థూలకాయాన్ని తగ్గించే మైక్రోచిప్


స్థూలకాయాన్ని తగ్గించుకోవడం కోసం నానా రకాల కుస్తీలు పట్టి.. కనిపించిన మందులన్నీ వాడి వాడి విసుగెత్తి ఉన్నారా..? అయితే ఉందిలే మంచి కాలం ముందు ముందునా..! అవునండీ మీ అధిక బరువును, స్థూలకాయాన్ని తేలిగ్గా తగ్గించేసే బుల్లి ఎలక్ర్టానిక్ మైక్రోచిప్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. దీనిని లండన్ కు చెందిన ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు ఇప్పటికే తయారు చేశారు. త్వరలోనే జంతువులపై పరీక్షిస్తారట. ఫలితాలు చూసిన తర్వాత తగిన మార్పులు చేసి మనుషులపై ప్రయోగాలు నిర్వహిస్తారు. 

ఈ బుల్లి మైక్రోచిప్ ను కడుపు లోపల శీర్షనాడికి అనుసంధానిస్తారు. ఆకలికితో పాటు మరెన్నో దేహ క్రియలలో శీర్షనాడి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ చిప్ ఏం చేస్తుందంటే.. శీర్షనాడి ద్వారా ఆకలికి సంబంధించిన రసాయనిక మార్పులను గుర్తించి మెదడుకు కొన్ని సంకేతాలు పంపిస్తుంది. ఫలితంగా ఆకలి తగ్గిపోయేలా మెదడు నుంచి సంకేతాలు విడుదల అవుతాయి.

దీనివల్ల మొత్తం మీద ఆకలి తగ్గి ఆహారం తక్కువగా తీసుకుంటారు. దానివల్ల బరువు తగ్గి, స్థూలకాయం కూడా వెళ్లిపోతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. బరువు తగ్గడానికి ఇదొక ప్రత్యామ్నాయ చికిత్స అవుతుందని.. ఇది విజయవంతం అయితే సర్జరీలతో పనేలేదంటున్నారు. ఇదేదో తొందరగా మార్కెట్లోకి వచ్చేస్తే బావుండు. 

  • Loading...

More Telugu News