: మహిళలకు నగరాల్లో ప్రత్యేక సిటీ బస్సులు!


మహిళలపై ఇటీవల నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచనల దిశగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు కనపడుతోంది. దేశంలోని అన్ని నగరాల్లో మహిళల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కొన్నిరోజుల కిందట కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే హైదరాబాదులో ఒకటి, రెండు బస్సులు స్త్రీలకోసమే ప్రత్యేకంగా నడుపుతున్నారు. ఇదే పద్ధతిలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు, కోల్ కతా, చెన్నై వంటి నగరాలలో ... మహిళలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యాచరణకు పూనుకుంది.

ప్రత్యేకంగా నడపనున్న ఈ బస్సుల్లో 'ఇంటెలిజెన్స్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్స్' (ఐటీఎస్) ను ఏర్పాటుచేయాలని రాష్ట్రాలకు సూచించింది. అంతేకాకుండా, ప్రయాణికుల భద్రతను కాపాడేందుకు ఉమ్మడిగా నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలిపింది. అయితే, జేఎన్ఎన్ ఆర్ఎం కింద మంజూరైన బస్సులను యూబీఎస్ ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు చేస్తేనే కేంద్ర నిధులను మంజూరు చేస్తారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత నిధిని వెచ్చించాలని తెలిపింది. 

  • Loading...

More Telugu News