: పంటలు పండించేది రైతు...ఆకలితో చచ్చేదీ రైతే: నరేంద్ర మోడీ
పంటలు పండించే రైతే ఆకలి చావు చస్తున్నాడని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ లోని నవాడలో ఆయన మాట్లాడుతూ, దేశానికి వెన్నెముక లాంటి రైతన్న ఆరుగాలం కష్టపడుతున్నాడని అన్నారు. అలాంటి రైతన్న ఎరువుల కోసం, వ్యవసాయ పెట్టుబడి కోసం అప్పులపాలై పండించిన పంటను అమ్ముకుని ఆకలి చావు చస్తున్నాడని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా స్పందించిందా? అని ఆయన నిలదీశారు. ఒక వైపు ధనవంతులు పెరిగిపోతుంటే, అంతకంటే పదిరెట్లు పేదలుగా మారుతున్నారని ఆయన మండిపడ్డారు. ఫుడ్ కార్పోరేషన్ పేరిట గోదాములు నడిపే ప్రభుత్వానికి వాటిని ఎప్పుడు పంచాలానే విషయంపై అవగాహన లేదని ఆయన ఎద్దేవా చేశారు.