: బాబు సమక్షంలో సైకిలెక్కిన పిన్నమనేని, బుద్ధప్రసాద్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో కృష్ణా జిల్లా మాజీ మంత్రులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్ సైకిలెక్కారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు తీవ్ర విముఖత ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని వారు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంపై ఉన్న నమ్మకంతోనే తాము కాంగ్రెస్ వీడి టీడీపీలో చేరుతున్నట్టు వారు స్పష్టం చేశారు. పిన్నమనేని, బుద్ధప్రసాద్ చేరికతో టీడీపీ మరింత బలపడిందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.