: సీపీఐ నారాయణకు లైన్ క్లియర్


ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సీపీఐ కార్యదర్శి నారాయణకు లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్, సీపీఐ మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రావడంతో ఆయన పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఈ మేరకు సీపీఐకి తెలంగాణలో ఒక లోక్ సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలిచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. ఖమ్మం లోక్ సభతో పాటు కొత్తగూడెం, పినపాక, వైరా, మునుగోడు, దేవరకొండ, బెల్లంపల్లి, స్టేషన్ ఘనపూర్, మహేశ్వరం, బహదూర్ పురా అసెంబ్లీ స్థానాలు సీపీఐకి ఇచ్చేందుకు హస్తం పార్టీ సుముఖంగా ఉందని సమాచారం.

  • Loading...

More Telugu News