: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి సేవలో బాలకృష్ణ
గుంటూరు జిల్లాలోని మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని సినీ నటుడు బాలకృష్ణ దర్శించుకున్నారు. ఆయనతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఉన్నారు. లెజెండ్ సినిమా హిట్ అయిన నేపథ్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు బాలయ్య తెలిపారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు బాలయ్యకు ఆశీర్వచనాలు పలికారు. బాలకృష్ణను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.