: 7 నుంచి ఇంటింటికీ ఓటర్ స్లిప్స్ పంపిణీ
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా... అంతా సవ్యంగా జరిగేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఓటర్లందరికీ ఈ నెల 7వ తేదీ నుంచి ఇంటింటికీ ఓటరు స్లిప్స్ పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా జంటనగరాల్లో ప్రారంభిస్తారు. తెలంగాణ ప్రాంతంలో ఈ నెల 10 నుంచి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి 20వ తేదీ కల్లా పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఈవీఎంల వినియోగంపై ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు అవగాహనా కార్యక్రమాలను కూడా ఎన్నికల సంఘం చేపట్టబోతోంది. ఈ కార్యక్రమాలు తెలంగాణలో ఈ నెల 10 నుంచి, సీమాంధ్రలో 17 నుంచి ప్రారంభమవుతాయి.