: 'ప్రధానమంత్రి పదవి'పై మన్మోహన్ చమత్కారం
దేశ ప్రధానిగా వరుసగా రెండు పర్యాయాలు ఎంపికై తొమ్మిదేళ్లుగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మన్మోహన్ సింగ్. మరి, ముచ్చటగా మడోసారీ ఆ పీఠంపై ఆశీనులవుతారా? దీనిపై ప్రధాని ఏమన్నారంటే... 'ఇవన్నీ ఊహాజనితమైనవి. బ్రడ్జి దగ్గరకు చేరుకున్నప్పుడే కదా, దానిని దాటేది' అంటూ ప్రధాని విలేకరుల ప్రశ్నలకు చిక్కకుండా సమాధానమిచ్చారు.
డర్బన్ లో బ్రిక్స్ సమావేశం ముగిసిన తర్వాత భారత్ కు తిరుగుముఖం పడుతున్న ప్రధాని మన్మోహన్ సింగ్ ను మీడియా ప్రతినిధులు 'మళ్లీ ప్రధాని'పై ప్రశ్నించారు. సోనియాగాంధీ కోరితే మరోసారి ప్రధానమంత్రి బాధ్యతల నిర్వహణకు అంగీకరిస్తారా? అని ప్రశ్నించగా.. ప్రధాని పైవిధంగా బదులిచ్చారు.