: తెలంగాణలో రేపు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ : భన్వర్ లాల్


తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ వెలువడుతుందని రాష్ట్ర ఎన్నికల సీఈవో భన్వర్ లాల్ తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఒక్కో అభ్యర్థికి సంబంధించి మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన చెప్పారు. అభ్యర్థితో పాటు ఐదుగురికి మాత్రమే కార్యాలయంలోకి వచ్చేందుకు అనుమతి వుందని ఆయన తెలిపారు.

బుధవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఆయన అన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఓటర్ల స్లిప్పుల పంపిణీ జరుగుతుందని సీఈవో తెలిపారు. రాష్ట్రంలోని 42 పార్లమెంటు స్థానాలకు 42 మంది ఎన్నికల పరిశీలకులను నియమించామని, 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు 84 మంది పరిశీలకులను నియమించామని భన్వర్ లాల్ తెలిపారు.

  • Loading...

More Telugu News