: దేవెగౌడ కుమారుడిపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
మాజీ ప్రధానమంత్రి హెచ్ డి దేవెగౌడ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఈసీకి లేఖ రాసిన ఆ పార్టీ.. బెంగళూరు రూరల్ స్థానానికి తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి డీకే సురేష్ ను హంతకుడు, గ్రానైట్ దొంగ అని పార్టీ వర్కర్ల సమావేశంలో సంబోధించినట్లు తెలిపింది. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అతను ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని స్పష్టమవుతోందని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది.