: ఆ రాష్ట్ర ఎన్నికల బరిలో... ఒక ప్రధాని, ఆరుగురు ముఖ్యమంత్రులు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక ప్రధాని, ఆరుగురు ముఖ్యమంత్రులు పోటీ పడనున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ తో పాటు గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వీరప్ప మొయిలీ, ధరమ్ సింగ్, యడ్యూరప్ప, సదానంద గౌడ, దేవెగౌడ, కుమారస్వామి ఎన్నికల బరిలో నిలబడ్డారు. యడ్యూరప్ప మినహా మిగిలిన అందరూ ఎంపీలుగా పని చేసినవారే కావడం విశేషం. వీరిలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు. చిక్ బళ్లాపూర్ నుంచి మొయిలీ, హసన్ నుంచి దేవెగౌడ, బీదర్ నుంచి ధరమ్ సింగ్, ఉడిపి నుంచి సదానంద గౌడ, బెంగళూరు రూరల్ నుంచి కుమారస్వామి, షిమోగ నుంచి యడ్యూరప్ప పోటీ పడుతున్నారు.