: గల్లా అరుణపై సీబీఐ కోర్టులో పిటిషన్


మాజీమంత్రి గల్లా అరుణ కుమారి కుటుంబంపై సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలైంది. గాలి పురుషోత్తమ నాయుడు ఈ పిటిషన్ ను అధికారులకు అందజేశారు. అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారని పిటిషనర్ ఆరోపించారు. ఈ మేరకు అరుణ కుటుంబ సభ్యులపై దర్యాప్తు జరిపించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఏపీఐఐసీ ఆక్రమించుకున్న స్థలాన్ని అధికారులతో కలసి ఆక్రమించుకున్నారని, తప్పుడు సమాచారంతో బహుళ అంతస్థుల నిర్మాణానికి సంబంధించి అనుమతులు పొందారని పిటిషన్ లో పేర్కొన్నారు. దాంతో, అరుణతో పాటు ఆమె భర్త రామచంద్రనాయుడు, కుమారుడు జయదేవ్, కుమార్తె రమాదేవి సహా తొమ్మిది మంది అధికారులపైన ఆరోపణలు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News