: పెట్రోల్ ధర తగ్గింది..!


వాహనదారులకు కాస్త ఊరట లభించే విధంగా, పెట్రోల్ ధరను లీటరుకు 75 పైసలు మేర తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పన్నులను మినహాయిస్తే మొత్తం మీద రూపాయి వరకు పెట్రోలు ధర తగ్గనుంది. సోమవారం అర్థరాత్రి నుంచి తగ్గిన పెట్రోలు ధరలు అమల్లోకి వచ్చాయి. గత అయిదు నెలల కాలంలో పెట్రోలు ధరలు తగ్గడం ఇదే తొలిసారి. డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

డాలర్ తో రూపాయి మారక విలువ పెట్రోలు ధర నిర్ణయంలో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. గత 8 ఎనిమిది నెలల కాలంలో తొలిసారి డాలర్ విలువ రూ. 60 కన్నా తక్కువగా పడిపోవడంతో పెట్రోల్ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. జనవరి నెలలో లీటరుకు 75 పైసలు, మార్చిలో 60 పైసలు మేర పెరిగిన పెట్రోల్ ధర ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. దీంతో, హైదరాబాదులో పెట్రోల్ ధర రూ. 79.90 నుంచి 78.90 రూపాయలకు తగ్గింది.

  • Loading...

More Telugu News