: వరంగల్ లో రేపు టీడీపీ ‘ప్రజాగర్జన’
వరంగల్ లో రేపు (బుధవారం) తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘ప్రజాగర్జన’ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు హన్మకొండ చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు కాకతీయ హరిత హోటల్ నుంచి ర్యాలీగా బయలుదేరి కాలేజి సెంటర్, ఏకశిల పార్కు మీదుగా హయగ్రీవాచారి స్టేడియం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు స్టేడియంలో జరిగే ‘ప్రజాగర్జన’లో బాబు పాల్గొని ప్రసంగించనున్నారు.