: ఎన్నికలప్పుడే కాంగ్రెస్ కి పేదలు గుర్తొస్తారు: మోడీ
కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలప్పుడే పేద ప్రజలు, దేశంలోని పేదరికం గుర్తొస్తాయని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని బరేలిలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ మేనిఫెస్టో పెద్ద మోసపత్రం అని అన్నారు. దేశం స్థిరమైన, సమర్థవంతమైన ప్రభుత్వాన్ని కోరుకుంటోందని అన్నారు. తనకు 60 నెలలు అవకాశం ఇస్తే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు.