: పదో తరగతి పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్
ఇంతకు ముందు డిగ్రీ, పీజీ కోర్సుల్లో మాత్రమే హైటెక్ కాపీయింగ్ కు పాల్పడిన ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. సరిగ్గా అలాగే, ఇప్పుడు పదో తరగతి పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్ పాల్పడిన గ్యాంగ్ ను మీడియా బట్టబయలు చేసింది. వరంగల్ లోని ఓ ప్రైవేటు పాఠశాల ఈ హైటెక్ కాపీయింగ్ వెనక ఉందనే ఆరోపణలు వినవస్తున్నాయి.
పదో తరగతి పరీక్ష కేంద్రాల బయట ఒక కారులో కొంత మంది కూర్చుని ఉండటం, లోపల పరీక్షార్థులు బ్లూ టూత్ సాయంతో ప్రశ్నాపత్రంలో ఏముందో వీళ్లకు చెప్పడం ద్వారా ఈ మొత్తం కాపీ వ్యవహారం నడిచింది. బయట నుంచి కారులో ఉన్న వాళ్లు పాఠ్య పుస్తకాలు, గైడ్లలో ఉన్న సమాధానాలను లోపల ఉన్న విద్యార్థులను అందిస్తుండగా మీడియా గమనించి పోలీసులకు సమాచారం అందించింది. దాంతో పోలీసులు వచ్చి ఈ ముఠా గుట్టును రట్టు చేశారు.