: ఈ నెల 9నే మున్సిపల్ ఫలితాలు వెల్లడించండి: హైకోర్టు
మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ నెల 9న కౌంటింగ్ తో పాటు అదే రోజున ఫలితాలు కూడా వెల్లడించాలని ప్రకటించింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ చెప్పిన వాదనను పరిశీలించకుండా ఉండలేమని పేర్కొంది. ఓటర్లు ప్రభావితం అవుతారన్న పిటిషన్లు అసంబద్దమని కోర్టు చెప్పింది. కొన్ని రోజుల నుంచి మున్సిపల్ ఫలితాలపై న్యాయస్థానంలో వాదనలు జరుగుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. తీర్పు వెలువరించడంతో నేటితో కోర్టులో ఫలితాలపై వాదనలు ముగిశాయి.