: పారిశ్రామిక వేత్తలకు పట్టం కడుతున్న ప్రభుత్వం: దాడి
ప్రభుత్వం పారిశ్రామిక వేత్తల నుంచి కలెక్షన్లు చేసుకుంటూ, ప్రజలను ఇబ్బంది పెడుతోందని టీడీపీ నేత దాడి వీరభద్రరావు తీవ్ర ఆరోపణలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా దొంతమూరు థర్మల్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు టీడీపీ పూర్తిగా వ్యతిరేకమని దాడి తెలిపారు. హైదరాబాదులో విలేకరులతో మాట్లాడిన ఆయన, పారిశ్రామిక వేత్తలకు జిల్లా కలెక్టరు తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జేసీ స్థాయిలో జరగాల్సిన ప్రజాభిప్రాయ సేకరణకు కలెక్టరు వెళ్లడం సమంజసం కాదన్నారు.