: సోనియా వ్యాఖ్యలు రాహుల్ కైతే సరిగ్గా సరిపోతాయి: కేజ్రీవాల్
ముఖ్యమంత్రి పదవి అంటే పిల్ల చేష్టలాగా కొందరు అనుకుంటారని... అందుకే సీఎం పదవిని వదిలి కేజ్రీవాల్ పారిపోయారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించడంపై ఆప్ అధినేత కేజ్రీ మండిపడ్డారు. తనది పిల్లలాట కాదని... తనకు 43 ఏళ్ల వయసు దాటిపోయిందని చెప్పారు. సోనియా వ్యాఖ్యలు ఆమె పుత్రరత్నానికైతే అతికినట్టు సరిపోతాయని ఎద్దేవా చేశారు.