: టీఆర్ఎస్ ను వీడిన మహిళా విభాగం కార్యదర్శి
తెలంగాణ రాష్ట్ర సమితికి మరో షాక్ తగిలింది. పలు పార్టీల నేతలు గులాబీ కండువా కప్పుకుంటుంటే, ఈ మధ్య ఆ పార్టీ నుంచి కూడా కొంతమంది అసంతృప్త నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ మహిళా విభాగం కార్యదర్శి రెహమున్నీసా ఈ రోజు రాజీనామా చేశారు. అమరవీరులు, ఉద్యమకారులకు కేసీఆర్ ద్రోహం చేశారని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు. ఆయన చెబుతున్న తెలంగాణ పునర్నిర్మాణం జరగదన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబ పాలన తప్పదని విమర్శించారు.