: రిపబ్లికన్ పార్టీ (అమెరికా) కో-ఛైర్మన్ గా తెలుగువాడు
అమెరికాలో మరో తెలుగు తేజం సత్తా చాటారు. వ్యాపారవేత్త గోపాల్ టీకే కృష్ణ ఐవా స్టేట్ రిపబ్లికన్ పార్టీ కో-ఛైర్మన్ గా ఎంపికయ్యారు. ఇప్పటిదాకా కో-ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన డానీ కారోల్ స్థానంలో గోపాల్ నియమితులయ్యారు. దీంతో రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం గోపాల్ కు దక్కింది.
హైదరాబాదులోని మెథడిస్ట్ స్కూల్ లో హైస్కూల్ విద్యను అభ్యసించిన గోపాల్... ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో పట్టాపుచ్చుకున్నారు. అనంతరం, అమెరికాలోని కన్సాస్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1969లో అమెరికాకు వలస పోయిన గోపాల్ చాలా ఏళ్లుగా రిపబ్లికన్ పార్టీకి సేవలందిస్తున్నారు.