: నారాయణ పోటీ చేయాలనుకోవడం సంతోషకరం... కాకపోతే..: తమ్మినేని
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం సంతోషకరమైన విషయమని సీపీఎం తెలంగాణ నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీతో కలసి పోటీ చేస్తుండటం బాధాకరంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ తో పొత్తు లేకపోతే ఎన్నికల్లో నారాయణకు మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. పొత్తుపై టీఆర్ఎస్ ప్రతిపాదిస్తే చర్చలకు సీపీఎం సిద్ధమని తెలిపారు.