: కోదండరాం వ్యాఖ్యలు విచారకరం: కొండా సురేఖ
టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం తమను తెలంగాణ ద్రోహులుగా వ్యాఖ్యానించడం విచారకరమని టీఆర్ఎస్ నాయకురాలు కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ పిలుపు ఇచ్చినందుకే టీఆర్ఎస్ లో చేరామని చెప్పారు. తాము తెలంగాణ ద్రోహులం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం తొలి రాజీనామా తమదే అని చెప్పారు. జగన్ సమైక్యాంధ్ర అన్నందుకే తాము వైఎస్సార్సీపీని వీడామని తెలిపారు. వరంగల్ తూర్పు స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగడానికి తాను సిద్ధమని ప్రకటించారు.