: అభ్యర్థుల ఖరారు బాధ్యత చిరు, రఘువీరా, బొత్సలదే
ఇందిరాభవన్ లో ఏపీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ ముగిసింది. దాదాపు మూడు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపైనే చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ స్థానంలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలి? అనే బాధ్యతను చిరంజీవి, రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు శాసనసభ అభ్యర్థుల ఎంపిక జాబితా వీరే ఖరారు చేయనున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీల సూచనలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.