: ఓటుకు నోటు తీసుకున్న ఆరుగురిపై కేసు
మున్సిపల్ ఎన్నికల్లో కృష్ణాజిల్లా, గుడివాడలో చోటు చేసుకున్న ‘ఓటుకు నోటు’ కేసు కొత్త మలుపు తిరిగింది. ఓటు వేసేందుకు డబ్బులు తీసుకున్న ఆరుగురు ఓటర్లపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, వైకాపా అభ్యర్థి ధనలక్ష్మి పంచినవి దొంగనోట్లు కాదని, 2005కు ముందు అచ్చయిన నోట్లని పోలీసుల విచారణలో వెల్లడైంది. 188, 171 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.