: సమావేశమైన ఏపీసీసీ ఎన్నికల కమిటీ
అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కొద్దిసేపటి క్రితమే సమావేశమైంది. హైదరాబాదులోని ఇందిరా భవన్ లో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో ఎన్నికల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులు, జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ప్రధానంగా ఈ భేటీలో సమీక్షించనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థుల వడపోత అనంతరం ప్రాథమిక జాబితాను తయారుచేస్తారు. రేపు, ఎల్లుండి జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి పరిశీలన నిమిత్తం ఈ జాబితాను అందజేయనున్నారు.