: భారత్ లో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ రాజీనామా
భారత్ లో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ రాజీనామా చేశారు. రెండేళ్ల తన పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో పావెల్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే, యూఎస్ లో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే వ్యవహారం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు చక్కదిద్దుకునేందుకు ప్రయత్నిస్తుండటం, కొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో పావెల్ పదవి నుంచి వైదొలగడం గమనార్హం. కాగా, పావెల్ రాజీనామాకు, ఇరు దేశాల మధ్య ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలకు ఎలాంటి సంబంధం లేదని ఆ దేశ డిప్యూటీ అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్ స్పష్టం చేశారు.