: సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి: శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సౌరభ్
గొప్ప సమాజాన్ని నిర్మించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఓటరు అవగాహన కోసం చేపడుతోన్న కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాకుళంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద మానవహారాన్ని నిర్వహించారు. డే అండ్ నైట్ సెంటర్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో యువతీయువకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఓటు వేయడంపై ప్రజల్లో అవగాహన కలుగజేయడం ఈ ర్యాలీ ముఖ్యోద్దేశమని జిల్లా కలెక్టర్ చెప్పారు.