: బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై బాలీవుడ్ నటుడు పోటీ


బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ పై పోటీగా బాలీవుడ్ నటుడు జావెద్ జాఫ్రీని ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దించుతోంది. ఉత్తరప్రదేశ్ లోని లక్నో స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయనకు ప్రత్యర్థిగా జాఫ్రీకి ఆప్ టికెట్ ఇచ్చింది. ఈ మేరకు నిన్న (సోమవారం) విడుదల చేసిన పార్టీ 13వ లోక్ సభ అభ్యర్థుల జాబితాలో మొత్తం 22 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో బీహార్, చత్తీస్ గఢ్, గుజరాత్, జార్ఖండ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ల నుంచి పోటీ చేస్తున్న లోక్ సభ అభ్యర్థుల పేర్లను తెలిపింది.

  • Loading...

More Telugu News