: తిరుమలలో భక్తుల ఆగ్రహం
సాధారణ భక్తులను పట్టించుకోకుండా ప్రముఖులకు ప్రాధాన్యం ఇస్తున్న టీటీడీ పాలకవర్గంపై భక్తులు మండిపడుతున్నారు. కొందరు ప్రముఖులు నేటి సాయంత్రం వెంకన్న దర్శనానికి వేంచేయడంతో సాధారణ భక్తులు ఉన్న క్యూలైన్లను అధికారులు నిలిపివేశారు. దీంతో, అసహనానికి లోనైన భక్తులు శ్రీవారి ఆలయం మహాద్వారం ఎదుట టీటీడీ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.