: పిడుగురాళ్ళ సమీపంలో చెన్నై ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ దోపిడీ


గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ సమీపంలోని తుమ్మలచెరువు వద్ద చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చెన్నై ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ దోపిడీ జరిగింది. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున 2.10 గంటల సమయంలో జరిగింది. రైల్లో ప్రయాణిస్తున్న సుమారు 10 మంది దుండగులు తుమ్మలచెరువు వద్ద చైన్ లాగి రైలుని నిలిపివేశారు. అనంతరం దుండగులు రైల్లో నుంచి దిగి కిటికీ పక్కన ఉన్న ప్రయాణికుల నుంచి భారీ మొత్తంలో బంగారం, నగదు దోచుకున్నారు. ఎస్-5, ఎస్-9, ఎస్-11, ఎస్-12 బోగీలలో ఈ దోపిడీ జరిగింది. దీంతో రైలు 30 నిమిషాలపాటు నిలిచిపోయింది. రైలు సికింద్రాబాద్ చేరుకున్న అనంతరం దోపిడీకి గురైన ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా రైల్వే ఎస్పీ శ్యామ్ ప్రసాద్ దోపిడీకి గురైన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఇలాంటి ఘటనలు పునరావృతమైతే దొంగలను కాల్చేందుకు కూడా వెనుకాడమని స్పష్టం చేశారు. వేసవి కాలంలో రైళ్లలో దోపిడీలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News