: బాలయ్య అభిమానులు 'లెజెండ్' స్క్రీన్ చించేశారు
అభిమానులు లేనిదే తాము లేమంటారు సినీ నటులు. అభిమానులకు ఆనందం కలిగినా, ఆగ్రహం వచ్చినా తట్టుకోవడం అసాధ్యం అని అభిప్రాయపడుతుంటారు. తాజాగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య 'లెజెండ్' సినిమా అనంతపురం 'గుర్నాథ్ థియేటర్'లో ప్రదర్శిస్తుండగా సౌండ్ సిస్టమ్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. పలు మార్లు యాజమాన్యానికి బాలయ్య అభిమానులు విజ్ఞప్తి చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు.
దీంతో ఆగ్రహించిన అభిమానులు సీట్లు విరగ్గొట్టి, స్క్రీన్ చించి వీరంగం వేశారు. దీంతో థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బాలయ్య సినిమా అంటే పవర్ ఫుల్ డైలాగులకు చిరునామా అని, అలాంటి డైలాగులు వినపడకపోతే ఇలాంటి పర్యవసానాలే ఎదురవుతాయని అభిమానులు అంటున్నారు.