: ఎంఐఎంలో 100శాతం, కాంగ్రెస్ లో 44శాతం, టీడీపీలో 33శాతం నేరచరితులే: అమీర్ ఖాన్


ఆంధ్రప్రదేశ్ లో పోటీ పడుతున్న రాజకీయపార్టీల్లోని అభ్యర్థుల నేరచరితపై బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సత్యమేవ జయతే కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల్లోనూ నేరచరితులు ఉన్నారని, నేరపూరిత రాజకీయాలపై అధ్యయనం చేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ వ్యవస్థాపకుడు, ఐఐఎమ్ ఆచార్యుడు జయదీప్ చోకర్ వెల్లడించారు. 543 మంది పార్లమెంటు సభ్యుల్లో 30 శాతం మంది, అంటే 162 మంది ఎంపీలపై కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో 44 శాతం మంది నేరచరిత కలిగిన వారు ఉండగా, టీడీపీలో 33 శాతం మంది నేరచరితులు ఉన్నారని అన్నారు. ఎంఐఎంలోని 100 శాతం మంది నేరచరితులేనని ఆయన తెలిపారు. వీరిలో చాలామందిపై హత్యకేసులు, హత్యాయత్నం కేసులు, అక్రమ మానవ రవాణా, కిడ్నాప్, దోపిడీ కేసులు ఉన్నాయని, ఇలాంటి వారి చేతుల్లో మన చట్టాలు తయారవుతున్నాయని అమీర్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News