: మురళీ మనోహర్ జోషికి పార్టీలోనే అవమానం


రాజకీయ కురువృద్ధుడు మురళీమనోహర్ జోషికి సొంతపార్టీ సమావేశంలోనే అవమానం ఎదురైంది. వారణాసి నుంచి బరిలో నిలవాలని భావించిన మురళీమనోహర్ జోషిని బీజేపీ అధిష్ఠానం ఒప్పించి కాన్పూర్ నుంచి బరిలో నిలిపింది. కాన్పూర్ లో కార్యకర్తల సమావేశంలో ఆయన కూర్చుని ప్రసంగిస్తుండగా, కాన్పూర్ మాజీ కార్పొరేటర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు వికాశ్ జైస్వాల్ 'ఎంతకాలం కూర్చుంటారు? కాస్త లేచి నిలబడండి. కార్యకర్తలకు మర్యాదనివ్వండి' అంటూ విరుచుకుపడ్డారు.

జోషి స్పందించే లోపు జైస్వాల్ మద్దతుదారులు జోషికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. చివరికి బీజేపీ అధిష్ఠానం జైస్వాల్ ను పార్టీ నుంచి బహిష్కరించింది. దీంతో రెచ్చిపోయిన జైస్వాల్ తన అనుచరులతో కలసి మురళీ మనోహర్ జోషి దిష్టిబొమ్మను దహనం చేశారు.

  • Loading...

More Telugu News