: మన ఆర్థిక మూలాలు భేష్: చిదంబరం
భారతదేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం తెలిపారు. విదేశీ మారకద్రవ్య నిల్వలు 300 బిలియన్ డాలర్లు దాటాయని చెప్పారు. 2013-14లో కరెంటు ఖాతా లోటు 35 బిలియన్ డాలర్లు ఉంటుందని... ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటును నియంత్రించగలిగామని అన్నారు. ఈ వివరాలను ఈ రోజు ఆయన ఢిల్లీలో తెలిపారు. బంగారం దిగుమతిపై ఆంక్షలను సడలిస్తామని చెప్పారు.