: మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అజంఖాన్


ఉత్తరప్రదేశ్ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి, ములాయం సింగ్ సన్నిహితుడు అయిన అజమ్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న సాయంత్రం యూపీలో అయోధ్యకు 5 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ, బాబ్రీ మసీదు కూల్చివేసిన తరువాతే ఉగ్రవాదం పెచ్చరిల్లిందని అన్నారు. బాబ్రీ కూల్చివేతకు ముందు ఏకే 47, ఆర్డీఎక్స్ అనే పదాలను దేశప్రజలు వినలేదని అన్నారు.

బాబ్రీ కట్టడాన్ని కూల్చివేయడంతో ఇవన్నీ తెరమీదికి వచ్చాయని అన్నారు. 1992 డిసెంబర్ 6 తరువాతే హిందూ ముస్లింల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని, అంతకు ముందు గొడవలు లేవని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో అజమ్ ఖాన్ భారతమాత ఒక రాక్షసి అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది.

  • Loading...

More Telugu News