: బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు
హైదరాబాదులోని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది (తెలుగు సంవత్సరాది) వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ సీనియర్ నేత విద్యాసాగరరావు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో పార్టీ నేతలు డా. లక్ష్మణ్, బద్ధం బాల్ రెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్ తో పాటు పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు.