: బంగీజంప్ లో ప్రపంచ రికార్డు


బంగీజంప్ లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. దుబాయ్ కి చెందిన 33 ఏళ్ల ఫిట్ నెస్ ట్రైనర్ కొలిన్ ఫిలిప్స్ 24 గంటల్లో 151 సార్లు బంగీజంప్ చేసి రికార్డు సృష్టించాడు. ఇందుకోసం అతను పది నెలలు కఠిన సాధన చేశాడు. 2011లో దక్షిణాఫ్రికాకు చెందిన కెవిన్ స్కాట్ 105 సార్లు బంగీజంప్ చేసి రికార్డు సృష్టిస్తే, దానిని కొలిన్ ఫిలిప్స్ బద్దలుకొట్టాడు. 24 గంటల్లో 200 సార్లు బంగీజంప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కొలిన్, రెండో ప్రయత్నంలోనే అదుపుతప్పి చెట్టుపై పడి గాయపడ్డాడు. దీంతో 151 సార్లు మాత్రమే జంప్ చేయగలిగాడు. కొలిన్ ఫిలిప్స్ ఇంగ్లాండ్ వాసి అయినా దుబాయ్ లో నివాసముంటున్నాడు.

  • Loading...

More Telugu News