: రాయపాటి పార్టీ మారినా నేను మారను: డొక్కా
తనకు దక్కిన గౌరవం, రాజకీయ జీవితం అన్నీ రాయపాటి సాంబశివరావు పెట్టిన బిక్ష అని, ఆయన ఏది చెబితే అది చేస్తానంటూ గత వారం విశ్వాసాన్ని ప్రకటించిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, తాజాగా కాంగ్రెస్ పార్టీపై విశ్వాసాన్ని ప్రకటించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాయపాటి టీడీపీలో చేరినప్పటికీ తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ నుంచి తప్ప ఎక్కడి నుంచైనా తాను పోటీకి సిద్ధమని ఆయన ప్రకటించారు.