: జూన్ నుంచి ఇక రోమింగ్ ఉండదోచ్!
జూన్ కల్లా దేశవ్యాప్తంగా రోమింగ్ ఛార్జీలను తొలగించే ప్రతిపాదనలున్నాయని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి చెప్పారు. ఆ దిశగా టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కసరత్తులు చేస్తోందని తెలిపారు. మంత్రి నేడు విశాఖలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, త్వరలోనే ఓకే దేశం.. ఒకే మొబైల్ నెంబర్ పథకం ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు. దీంతో, దేశంలో ఎక్కడైనా ఒకే మెుబైల్ నంబర్ తో కార్యకలాపాలు సాగించవచ్చని మంత్రి వివరించారు. ఇక రూ. 300 కోట్లతో గిరిజన ప్రాంతాల్లోనూ సెల్ టవర్లు ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు.