: దుర్గగుడిలో ఇవాళ్టి నుంచి వసంత నవరాత్రోత్సవాలు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ, మల్లేశ్వర స్వామి వార్లకు ఇవాళ్టి (సోమవారం) నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఉగాది సందర్భంగా కనకదుర్గ అమ్మవారికి స్నపన కార్యక్రమాన్ని నిర్వహించి, ఆ తర్వాత వసంత నవరాత్రి ఉత్సవాలను జరపడం ఆనవాయతీ. ఉగాది నాడు వెండి రథంపై అమ్మవారి నగరోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు చైత్రమాస బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 13వ తేదీన కనకదుర్గమ్మ, మల్లేశ్వర స్వామివార్ల కల్యాణోత్సవం జరుగుతుంది. రూ. 1116 చెల్లించి భక్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.