: వివేక్ పార్టీలో చేరిన విషయం నాకు తెలియదు: శ్రీధర్ బాబు
టీఆర్ఎస్ నేత, ఎంపీ వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తనకు తెలియదని మాజీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తామంతా అధిష్ఠానంపై నమ్మకముంచామని అన్నారు. తమకు ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ అధిష్ఠానంతో చెప్పుకుంటామని చెప్పిన శ్రీధర్ బాబు, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తామని స్పష్టం చేశారు.