: చాందినీ చౌక్ లో ఆప్ పై దాడి
ఢిల్లీలోని చాందినీ చౌక్ లో ఆమ్ ఆద్మీ పార్టీ బహిరంగ సభపై దాడి జరిగింది. చాందినీ చౌక్ నియోజకవర్గంలో సీతారామ్ బజార్ లో ఆప్ బహిరంగ సభలో, చాందినీ చౌక్ ఆప్ అభ్యర్థి అశుతోష్ మాట్లాడుతుండగా దగ్గర్లోని ఒక భవనం నుంచి బాటిళ్లు విసిరారు. దీనితో సభలో గందరగోళం చోటుచేసుకుంది. ఇలాంటి దాడులకు తాము భయపడేది లేదని, ఇలాంటి దాడులను అందరూ ఖండించాలని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. వీటన్నింటినీ దాటుకుంటూ ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. చాందినీ చౌక్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ పోటీ చేస్తున్నారు.