: నేను కాంగ్రెస్ లో చేరుతున్నా: వివేక్


కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గుర్తించిందని ఎంపీ వివేక్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. బీజేపీతో పాటు మరిన్ని చిన్న పార్టీలు ప్లేటు ఫిరాయించినప్పటికీ సోనియా గాంధీ చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని వివేక్ అన్నారు. టీఆర్ఎస్ మాట తప్పిందని ఆయన ఎద్దేవా చేశారు. విలీనం చేయాలని తాము సూచించామని ఆయన అన్నారు. అయినప్పటికీ కేసీఆర్ తమ నమ్మకాన్ని వమ్ముచేశారని, తమ అభిప్రాయాలను బేఖాతరు చేయడంతో, తాను టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నానని ఆయన అన్నారు. సోనియా గాంధీ మీద నమ్మకంతోనే తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News