: పేరు ఎంత పని చేసింది!


పేరులో ఏముందిలే అని అనుకుంటే పొరపాటే. పేరు కొంతమందికి గుర్తింపు తీసుకురావచ్చు గాక. కానీ, ఇక్కడ మాత్రం ఎన్నికల బరిలో దిగిన చందూలాల్ సాహూకి... పేరుతో పెద్ద చిక్కొచ్చి పడింది. ఛత్తీస్ గఢ్ లోని మహాసముంద్ నుంచి పోటీ చేస్తున్న అజిత్ జోగి తన ప్రధాన ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు ఓ ఎత్తు వేశారు.

బీజేపీ అభ్యర్థి చందూలాల్ సాహూని ఓడించేందుకు ఒకరు, ఇద్దరూ కాదు... ఏకంగా పది మందితో అజిత్ జోగి నామివేషన్ వేయించారు. వీరందరి పేరులో ‘సాహూ’ ఉంది. వీరిలో ఆరుగురు చందులాల్ సాహూలు. ఒకరి పేరు చందురామ్ సాహూ. మిగతా వారి పేరు చివరలో కూడా సాహు ఉంది. కాబట్టి బీజేపీకి ఓటు వేసేవారు తికమకపడి ఒక చందూరామ్ కి వేయాల్సిన ఓటు ఇంకో చందూరామ్ కి వేసే అవకాశం ఉంది. కాబట్టి ఎలాగోలా మహాసముంద్ ఎన్నికల్లో గట్టెక్కవచ్చన్నది అజిత్ జోగి ఆలోచన.

పరిస్థితిని గమనించిన బీజేపీ, ఇప్పుడు ఈ సాహూలందరినీ విత్ డ్రా చేయించాలని ప్రయత్నించింది. కానీ అందరూ ఫోన్లు స్విచ్చాఫ్ చేసేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో ఇప్పుడు బీజేపీ అభ్యర్థి అయిన చందూలాల్ సాహూ అయోమయంలో పడిపోయారు. అజిత్ జోగితో పోరాడాలా? లేక సాహూలతో పోరాడాలా? అన్నది ఇప్పుడు ఈ ఒరిజినల్ చందూలాల్ సాహూ ముందున్న ప్రశ్న.

  • Loading...

More Telugu News