: విషమిస్తోన్న టీడీపీ నేతల ఆరోగ్యం


విద్యుత్ సమస్యపై నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ నేతల్లో అత్యధికుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం పట్ల సర్కారు వైఖరిని నిరసిస్తూ 26 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. వారిలో, దేవినేని ఉమ, సత్యవతి రాథోడ్, అనసూయ, సీఎం రమేశ్, జైపాల్ యాదవ్, శ్రీరాం రాజగోపాల్, ఆంజనేయులు, కె.శ్రీధర్ ల ఆరోగ్యం బాగా క్షీణించినట్టు వైద్యులు తెలిపారు.

ఈ సాయంత్రం వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ లెవల్స్ పెరిగిన నేపథ్యంలో వారికి వెంటనే చికిత్స అందించాలని వైద్యులు అంటున్నారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అంబులెన్స్ ను కూడా అందుబాటులో ఉంచారు. కాగా, సర్కారు తమ డిమాండ్లను అంగీకరించేవరకు దీక్ష విరమించేది లేదని టీడీపీ నేతలు స్సష్టం చేశారు. 

  • Loading...

More Telugu News