: బెంగళూరులో జోరుగా ప్రచారం చేస్తున్న వివేక్ ఓబెరాయ్
బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ బెంగళూరులో జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు. ఆతను రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు చేశాడనేగా మీ ప్రశ్న... వివేక్ తన అత్తగారి కోసం ప్రచారంలో పాల్గొంటున్నాడు. తన అత్తగారైన నందీనీ అల్వా జనతాదళ్ సెక్యులర్ పార్టీ తరపున బెంగళూరు సెంట్రల్ నుంచి బరిలో ఉన్నారు. ఎప్పుడూ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ప్రశంసించే వివేక్, బీజేపీని పొగడడం మానేశారు.
తనకు పిల్లనిచ్చిన అత్తగారైన నందినీ అల్వా కోసం బెంగళూరులో పాగా వేశారు. 'మా అత్తగారు చాలా మంచిది...మీ ఓటు మా అత్తగారికే' అంటూ ఉత్తరాది ఒటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గురుద్వారాలకు వెళ్లి అక్కడి సిక్కు ఓటర్లను కలుస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాడు. అయితే తన మద్దతు తన అత్తగారికే తప్ప జనతాదళ్ సెక్యులర్ పార్టీకి కాదని స్పష్టం చేస్తున్నాడు.