: భుల్లర్ మరణ శిక్ష జీవిత ఖైదుగా మార్పు
ఢిల్లీ బాంబు పేలుళ్లకేసు నిందితుడు దేవీందర్ పాల్ సింగ్ భుల్లర్ మరణ శిక్షను సుప్రీంకోర్టు జీవితఖైదుగా మార్చింది. 1993లో ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో దోషిగా తేలిన భుల్లర్ కు మరణశిక్ష పడింది. దీంతో, తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని భారత రాష్ట్రపతికి భుల్లర్ విజ్ఞప్తి చేశారు. అయితే, భుల్లర్ కోరికను ఎనిమిదేళ్ల అనంతరం 2003లో రాష్ట్రపతి తిరస్కరించారు. ఈ నేపథ్యంలో భుల్లర్ మానసిక పరిస్థితి బాగాలేదని... మానవతా దృక్పదంతో శిక్ష తీవ్రతను తగ్గించాలని ఆయన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును కోరారు. ఈ నేపథ్యంలో 49 ఏళ్ల భుల్లర్ మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారిస్తే తమకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో ఈ రోజు సర్వోన్నత న్యాయస్థానం భుల్లర్ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది.